ప్రజావాణికి అధికారుల డుమ్మా

by velandi.Saikiran |

ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్

ప్రజావాణికి అధికారుల డుమ్మా
X

దిశ, పిట్లం: ప్రజావాణికి అధికారులు డుమ్మా కొట్టారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం వల్ల నిర్వీర్యం అవుతోంది. అందుకు నిదర్శనమే పిట్లం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం. ఈ ప్రజావాణి కార్యక్రమంలో 11 గంటలు గడుస్తున్నప్పటికీ ఒక్క మండల అధికారి సైతం పాల్గొనలేదు.

గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి సమస్యలు తలెత్తిన ప్రజావాణిలో పరిష్కరించుకోవచ్చు అన్న ఆశ రోజురోజుకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరు గారిపోతోంది.తమ సమస్యలను పట్టించుకునే అధికారులు ప్రజావాణిలో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story