నిజాం సాగ‌ర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుద‌ల

by Ratna Kumari |

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా ఆరు వరద గేట్లను

నిజాం సాగ‌ర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుద‌ల
X

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం ప్రాజెక్టు ద్వారా ఆరు వరద గేట్లను ఎత్తి దిగువకు 51 వేల 762 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ అక్షయ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 51 వేల 762 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1404.92 అడుగుల (17. 687 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు ఆరు వరద గేట్లను ఎత్తివేసి 51 వేల 762 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల, గొర్రెల కాపరులు మంజీరా నది వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని, లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు.

Next Story