- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్మూర్ మున్సిపల్ లో నయా రూల్స్ అంటూ.. పోస్టుల వైరల్..!
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నయా రూల్స్ అంటూ.. వైరల్ అవుతున్న పోస్టులను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ చదువుతున్నారు.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో నయా రూల్స్ అంటూ.. వైరల్ అవుతున్న పోస్టులను ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తూ చదువుతున్నారు. ఎమ్మార్పీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి మైలారం బాలు ఆర్మూర్ ప్రాంతంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో ఆర్మూర్ మున్సిపల్ పాలకుల తీరు పై పోస్టులు పెడుతుండడంతో ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రజలు దీన్ని ఒక నయా ట్విస్ట్ గా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో నైనా ఎక్కడైనా ఒకరే చైర్మన్ ఉంటారని, కానీ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ లో మాత్రం ముగ్గురు చైర్మన్లు, ఒక వైస్ చైర్మన్, ఒక కౌన్సిలర్ ఇలా ఐదుగురు కబంధ హస్తాల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ పాలన వింత పోకడలతో అతలాకుతలంగా సాగుతోందని ఉంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రతినిత్యం రాత్రి ఏడు గంటలైనా మున్సిపల్ కార్యాలయంలో విధులు కొనసాగు తున్నాయని, మున్సిపల్ పరిధిలోని 36 వార్డుల్లో ఏ చిన్న గల్లీలో ఏం జరిగినా ఆర్మూర్ మున్సిపాలిటీ కబంధహస్తాల్లో నడిపిస్తున్న ఈ ఐదుగురికి తప్పకుండా తెలవాల్సిందేనని ఉకుం జారీ చేసినట్లు వినబడుతుంది.
ఆర్మూర్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రైవేట్ చెత్త సేకరణ బండ్లను నియామకం చేసుకొని ప్రైవేట్ ఒక్కో బండికి లక్ష రూపాయలను వసూలు చేశారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుల్లో పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో ప్రైవేట్ చెత్త బండ్లను ఏర్పాటు చేసేందుకు ఆ బండికి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసి ప్రజల వద్ద నుంచి డబ్బులు గుంజేందుకు ఆ ప్రైవేట్ వారికి చేసి చేయనట్లుగా సహాయం అందిస్తున్నట్లు చేస్తున్నారని ఈ పోస్టులో పేర్కొన్నారు. ప్రజల వద్ద నుంచి ప్రవేట్ చెత్త బండ్ల వ్యక్తులకు చెత్త సేకరణ కోసం ఒక్కో ఇంటికి 50 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారట దయచేసి ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయకండి అంటూ పోస్టులో పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో జరుగుతున్న ఈ పనులకు ఎవరు ఏ తీరుగా డబ్బులు పంచుకున్నారో ప్రజలమైన మాకు అవసరం లేదని, చెత్త సేకరణ కోసం ప్రజల వద్ద నుంచి మాత్రం వసూలు చేయకండి అంటూ పేర్కొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో వైరల్ అవుతున్న ఈ పోస్టులను పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించడంతోపాటు పోస్టుల్లో ఉన్న వివరాలను చదువుతూ ఆర్మూర్ మున్సిపల్ లో జరుగుతున్న పరిమాణాలపై పట్టణ ప్రజలు జోరుగా చర్చించు కుంటున్నారు. పలు సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఈ పోస్టులపై ఆర్మూర్ పట్టణ ప్రజలు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. పట్టణ ప్రజల అభివృద్ధికి కృషి చేయాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు ఇలా కూర్చుండి లెక్కలు వేసుకుంటూ ప్రజలను ఏ విధంగా దోచుకోవాలో ఆలోచనలతో విధులు నిర్వహించడం చాలా కష్టతరమైన పని అని, పైసలు ఎక్కడికి పోతున్నాయి ఆ జవాబు పట్టణ ప్రజలందరికీ తెలుసు ఆ పెద్దను త్వరలోనే గుడ్డలు ఊడదీసి చౌరస్తాలో ఉరికిస్తే రాష్ట్రమంతటా ఉన్న ఇలాంటి పెద్దలకు కనువిప్పు కలుగుతుంది అంటూ.. ఇదే మంచి శిక్ష అని అంటూ ఆర్మూర్ ప్రజలు గుసగుస లాడుతున్నారు. ఈ పోస్టులో మరిన్ని మున్సిపాలిటీ ఆసక్తికర విషయాలు.. అంబేద్కర్ జయంతి తర్వాత తెలియజేస్తామంటూ పోస్టులో పేర్కొన్నారు.






