సెల్ ట‌వ‌ర్ ఎక్కి వృద్ధుడు హ‌ల్ చ‌ల్..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, భిక్క‌నూరు : బ‌త‌కాల‌ని లేదు.. పై నుంచి దూకి నేను చచ్చిపోతా అంటూ ఓ వృద్ధుడు సెల్ ట‌వ‌ర్ ఎక్కి హ‌ల్ చ‌ల్ సృష్టించాడు. సెల్ ట‌వ‌ర్ ఎక్కి దాదాపు గంట‌న్న‌ర

సెల్ ట‌వ‌ర్ ఎక్కి వృద్ధుడు హ‌ల్ చ‌ల్..!
X

దిశ‌, భిక్క‌నూరు : బ‌త‌కాల‌ని లేదు.. పై నుంచి దూకి నేను చచ్చిపోతా అంటూ ఓ వృద్ధుడు సెల్ ట‌వ‌ర్ ఎక్కి హ‌ల్ చ‌ల్ సృష్టించాడు. సెల్ ట‌వ‌ర్ ఎక్కి దాదాపు గంట‌న్న‌ర పాటు హంగామా చేసిన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా భిక్క‌నూరు మండ‌లం జంగంప‌ల్లి గ్రామంలో ఇవాళ‌ సాయంత్రం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన మ‌ల్ల‌య్య‌(65) వృద్ధుడు తాగుడికి బానిసై ఉన్న రెండు ఎక‌రాల భూమిని, జాగ‌ల‌ను అమ్ముకొని ఏమి మిగ‌ల్చ‌కుండా చేశాడంటూ కుటుంబ స‌భ్యులు గొడ‌వ‌ప‌డ్డారు. కోపంతో కుమారుడు గరం గరం చాయ్ తండ్రి పై పోసి ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో కోపంతో ఊగిపోయిన వృద్ధుడు, సబ్ స్టేషన్ వెనకాల ఉన్న సెల్ టవర్ ఎక్కి అక్కడికి చేరుకున్న గ్రామస్తులను ఆగం పట్టించాడు. కిందికి దిగి రావాలని ఎంతమంది గ్రామస్తులు వచ్చి నచ్చ జెప్పిన వినిపించుకోకుండా టవర్ పైనే కూర్చొని హల్ చల్ చేశాడు. ఈ విషయం స్థానిక పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ ఐ ఆంజనేయులు ఘటనా స్థలానికి తన సిబ్బందితో చేరుకొని న్యాయం చేస్తానని, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో, అప్పుడు వృద్ధుడు కిందికి దిగి రావడంతో కథ సుఖాంతం అయింది.

Next Story