- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాస్ పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం.. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
దిశ, కామారెడ్డి : పాస్ పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ ఇన్ చార్జి డీఐజీ, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

దిశ, కామారెడ్డి : పాస్ పోర్ట్ విచారణలో నిర్లక్ష్యం వహించిన ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ లను సస్పెండ్ చేస్తూ ఇన్ చార్జి డీఐజీ, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేసినట్టు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. గతంలో ఎస్బీ లో పని చేసి పాస్ పోర్ట్ విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినందుకు భిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఏఎస్ఐ నర్సయ్య, రామారెడ్డి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖలో బాధ్యత రాహిత్యానికి ఎక్కడా స్థానం లేదన్నారు. ప్రజల భద్రత, న్యాయం, నైతిక విలువల పట్ల ప్రతి పోలీసు సిబ్బంది నిబద్ధతతో వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా పోలీసు శాఖ సమర్థంగా పనిచేస్తుందన్నారు. బాధ్యత లేకుండా ప్రవర్తించే పోలీసు సిబ్బందిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు.






