- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
8న జాతీయ మెగా లోక్ అదాలత్
by Naveena |
ఈనెల 8న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు.

X
దిశ, కామారెడ్డి : ఈనెల 8న నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకొని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని జిల్లా ఎస్పీ సింధు శర్మ కోరారు. రాజీమార్గం రాజమార్గం అని, కక్షలు కారుణ్యాలతో ఏమీ సాధించలేమన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందన్నారు. రాజీ పడ దగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, చిన్న చిన్న దొంగతనాల కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, న్యూసెన్స్ కేసులు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులతో పాటు ఇతర రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. న్యాయ శాఖ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Next Story






