- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మనమంతా ఏకమైతే అధికారం మనదే... ఇమ్మడి గోపి
ధర్పల్లి మండలం సీతయిపేట గ్రామంలో ఈరోజు ముదిరాజ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

దిశ, ధర్పల్లి : ధర్పల్లి మండలం సీతయిపేట గ్రామంలో ఈరోజు ముదిరాజ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ధర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజుల రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి ఆధ్వర్యంలో సితాయిపేట ముదిరాజ్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ముందుగా అతిధులు, కార్యకర్తలు ధర్పల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు జరిపి అక్కడి నుండి పాదయాత్రగా సితాయిపేటలోని సభ ప్రాంగనానికి చేరుకున్నారు.
అనంతరం జెండాను ఆవిష్కరించి, వక్తలు మాట్లాడుతూ ముదిరాజులంతా ఏకమైతే అధికారం మనదవుతుందంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడి గోపి మాట్లాడుతూ చేపల వేటలో మనకు వాటా లేదంటూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ముదిరాజ్ లు వెనుకబడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ముదిరాజ్ బందు కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమన్ని జిల్లా ముదిరాజ్ ప్రజలు పాల్గొన్ని విజయవంతం చేసారన్నారు.






