ఎంపీడీవోల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

by Naveena |

తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం కామారెడ్డి జిల్లా 2025- 2027 కార్యవర్గ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు.

ఎంపీడీవోల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
X

దిశ, కామారెడ్డి : తెలంగాణ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల సంఘం కామారెడ్డి జిల్లా 2025- 2027 కార్యవర్గ ఎన్నికలు మంగళవారం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎన్నికల అధికారి, సీఈవో చందర్ ఆధ్వర్యంలో జరిగాయి. అయితే అధ్యక్షులుగా టీవీఎస్ గోపి బాబు (మాచారెడ్డి), ప్రధాన కార్యదర్శిగా ఎం.సంతోష్ కుమార్ (సదాశినగర్), కోశాధికారిగా ఎల్.రాజేశ్వర్ (గాంధారి), ఉపాధ్యక్షులుగా రాణి (మద్నూర్), జాయింట్ సెక్రటరీగా కమలాకర్ (పిట్లం) ఎగ్జిక్యూటివ్ మెంబర్లు గా సయ్యద్ సాజిద్ అలీ (తాడ్వాయి), నాగవర్ధన్ (కామారెడ్డి), శ్రీనివాస్ (జుక్కల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Next Story