గోదావరి పుష్కరాలకు నిధులు కోసం ప్రయత్నాలు: ఎంపీ సురేష్ రెడ్డి

by Ratna Kumari |

దిశ, ఆర్మూర్ : వ‌చ్చే ఏడాది గోదావ‌రి పుష్క‌రాలు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) కి నిధుల కేటాయింపు కోసం

గోదావరి పుష్కరాలకు నిధులు కోసం ప్రయత్నాలు: ఎంపీ సురేష్ రెడ్డి
X

దిశ, ఆర్మూర్ : వ‌చ్చే ఏడాది గోదావ‌రి పుష్క‌రాలు జ‌రుగ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగ‌ర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) కి నిధుల కేటాయింపు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు బీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నాయకుడు, ఎంపీ కే.ఆర్‌. సురేష్ రెడ్డి ప్రారంభించారు. సురేష్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ కి నిధులు కేటాయించాలని కోరుతూ లేఖ రాశారు. ప్రసాద్ (తీర్థయాత్ర పునరుజ్జీవనం, ఆధ్యాత్మిక వృద్ధి డ్రైవ్) పథకం కింద నిధుల కేటాయింపు 2026/27 సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులని ఎంపీ సురేష్ రెడ్డి కోరారు.

గోదావరి పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే కార్యక్రమం కాబట్టి లక్షలాది మంది యాత్రికులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరిస్తారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) వద్ద సహాయక, మౌలిక సదుపాయాలతో పాటు రామాలయ, శివాలయం మందిరాలను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కే.ఆర్. సురేష్ రెడ్డి అభ్యర్థించారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది యాత్రికులు వచ్చే అవకాశం ఉందని వివరించారు. పుష్కరాల సమయంలోనే గోదావరి నది రాష్ట్రంలోకి నిజామాబాద్ జిల్లాలో ప్రవేశిస్తుంది అన్నారు. పోచంపాడు లోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు శివారులో గల రామమందిరం, శివ మందిరం వారానికి వేలాది మంది భక్తులను ఆకర్షిస్తాయని, అందువల్ల ప్రసాద్ పథకం కింద నిధులు సమకూర్చాల్సిన అత్యంత అవసరమైన ఆవశ్యకతను కేంద్రమంత్రికి సురేష్ రెడ్డి వివరించారు.

Next Story