- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్’: ఎంపీ ధర్మపురి అరవింద్
కేసీఆర్, రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీల్లో వణుకు పుడుతుందని మీడియా సమావేశంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.

దిశ, కామారెడ్డి: తెలంగాణలో కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ ప్రభావం కేసీఆర్, కేటీఆర్‌పైనే ఉంటుందని మిగతా ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని, ఆ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కవిత సత్తెపూస ఏం కాదని, ఆమెకు లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఏం ఇవ్వలేదని, ప్రస్తుతం సీబీఐ ఎంక్వయిరీ కూడా నడుస్తుందన్నారు. కేసీఆర్‌ను తిట్టడానికే సీఎం రేవంత్ రెడ్డి కవితతో టీఆర్ఎస్ పార్టీని స్థాపింప చేశారని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో ఎవరికీ పెద్దగా ప్రభావం చూపనప్పటికీ బీజేపీకి మాత్రం ఆ పార్టీతో మేలే జరుగుతుందన్నారు. 10 న తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఉందని, ఆయన పర్యటన పక్కా పొలిటికల్ కోసమేనన్నారు. ఆయన పర్యటనతో కేసీఆర్, రేవంత్ రెడ్డితో పాటు ఇతర పార్టీల్లో వణుకు పుడుతుందన్నారు. మోడీ పర్యటన 2028 ఎన్నికలకు నాంది పలకడానికేనన్నారు.
పరేడ్ గ్రౌండ్‌లో సుమారు నాలుగు లక్షల మందితో..
ఇప్పటికే దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకుని వస్తుందని, పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో ప్రాంతీయ పార్టీల్లో వణుకు పుట్టడం ఖాయమన్నారు. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీల్లో ప్రస్తుతం అభద్రతాభావం ఏర్పడుతుందని, ఇప్పటికే కాంగ్రెస్‌ను ప్రజలు మరిచిపోయారన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో సుమారు నాలుగు లక్షల మందితో ప్రధాని మోడీ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సభ కంటే ముందు రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వారే వారి గోతులను తవ్వుకున్నట్లు అయిందన్నారు. దీంతో మహిళలకు ఎవరు వ్యతిరేకం, ఎవరు సపోర్టు అనేది తేలిపోయిందన్నారు. ప్రధాని మోడీపై తెలంగాణ ప్రజలకు అమితమైన ప్రేమ ఉందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, అరుణతార, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం రాజులు, నాయకులు లక్ష్మారెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






