ప్రమాదం అంచున ఆ ఊరి వంతెన

by Disha Web Desk 20 |
ప్రమాదం అంచున ఆ ఊరి వంతెన
X

దిశ, మోర్తాడ్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో నుండి వడ్యాట్ గ్రామానికి వెళ్లే వంతెన సమీపంలోని రోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు ముసలమ్మ చెరువులోని నీరు విస్తృతంగా ప్రవహించడంతో రోడ్డుకు ఒక వైపు కోతకు గురైంది.

దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రాత్రి వేళలో రోడ్డుకు ఇరువైపులా దీపాలు కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకొని తగిన మరమ్మతులు చేయాలని గ్రామ ప్రజలు, వాహనదారులు, ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు.

Next Story