అడూరులో కాంగ్రెస్ ప్రచారానికి ఊపు

by Ratna Kumari |

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఏ

అడూరులో కాంగ్రెస్ ప్రచారానికి ఊపు
X

దిశ, జుక్కల్, నిజాంసాగర్ : కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఏఐసీసీ పరిశీలకులుగా ఉన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అడూర్‌లో శనివారం పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, ముఖ్యంగా ఈ నెల 30న నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్ల పై సమగ్రంగా చర్చించారు. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఏఐసీసీ పరిశీలకులు, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ అడూర్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో కృషి చేస్తే కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ విధానాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి అని తెలిపారు. ఈ నెల 30న జరిగే రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బలాన్ని చాటే అవకాశం ఉంది. అందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి అని ఆయన పేర్కొన్నారు.

Next Story