ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

by Nallavelli.Anjaneyulu |

దిశ : నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి

ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపోను ఏర్పాటు చేయాలి : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
X

దిశ : నాగిరెడ్డిపేట్ : (ఎల్లారెడ్డి) : ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు, ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఆర్టీసీ బస్ డిపో ను ఏర్పాటు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కోరారు. మంగళవారం హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మాట్లాడుతూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామీణ ప్రాంతాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యాలు లేకపోవడంతో పాటు, విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. నియోజకవర్గ ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సర్వీసులను పెంచి, ఫ్రీక్వెన్సీ మెరుగుపరచాలన్నారు. నియోజకవర్గానికి 10 నూతన ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియశారు. అలాగే నియోజకవర్గానికి మరిన్ని కొత్త బస్సులను కేటాయించాలని కోరారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు కు అనువైన 5 ఎకరాల స్థలం అందుబాటులో ఉన్నట్లు, నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ బస్సు డిపో ను ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి సానుకూలంగా స్పందించార‌ని.. త్వరలోనే నియోజకవర్గానికి తగిన రవాణా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Next Story