ఎమ్మెల్యే ఒక మానసిక రోగి

by Nallavelli.Anjaneyulu |

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగాయి.

ఎమ్మెల్యే ఒక మానసిక రోగి
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వైఖరి పై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిప్పులు చెరిగాయి. తన రాజకీయ ఉనికి కోసం అబద్ధాలు ప్రచారం చేస్తూ.. సంస్కారహీనంగా మాట్లాడుతున్న ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుల తీరును తీవ్రంగా ఖండించారు. బుధవారం కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు సందీప్, బీబీపేట మండల అధ్యక్షుడు సుతారి రమేశ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, మాచారెడ్డి మండల అధ్యక్షుడు నౌసి లాల్ నాయక్ మాట్లాడారు. ​సొంత తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర నీది అన్నారు. ​ఎమ్మెల్యే రమణారెడ్డి ఒక మానసిక రోగి అని విమర్శించారు. కన్న తండ్రిపైనే చేయి చేసుకున్న చరిత్ర కలిగిన వ్యక్తికి, తమ నాయకుడు షబ్బీర్ అలీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గతంలో విద్యార్థి సంఘాలు మీ ఇంటిని ముట్టడించి మీ తండ్రిపై దాడికి ప్రయత్నించినప్పుడు కాపాడింది షబ్బీర్ అలీ కాదా?అని ప్రశ్నించారు. సొంత పార్టీ ప్రధానమంత్రి మోడీని కూడా విమర్శించే వ్యక్తికి, ఎదుటివారిని గౌరవించడం తెలియదని ఎద్దేవా చేశారు.

​అఫిడవిట్ అంతా అబద్ధాలే..

ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రమణారెడ్డి సమర్పించిన అఫిడవిట్ అంతా అబద్ధాల మయం అని ఆరోపించారు. లక్షల్లో ఇన్కమ్ టాక్స్ చెల్లించే వ్యక్తి 150 కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం ప్రజలను వంచించడమే అవుతుందన్నారు.. నీపై ఇన్కమ్ టాక్స్ కేసులు వేస్తామని హెచ్చరించారు. డిగ్రీ కాలేజీ భూముల్లో జరిగిన ప్రతి చిన్న అక్రమానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, దీనిపై చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. వైశ్యుల గురించి మాట్లాడుతున్న ఎమ్మెల్యేకు, మార్వాడీల వల్ల వైశ్య వ్యాపారాలు దెబ్బతింటున్నా అడిగే దమ్ముందా? అని నిలదీశారు.​ఎన్నికల సమయంలో కత్తిపోట్ల అంశాన్ని తెరపైకి తెచ్చి సానుభూతి పొందాలని చూడటం రమణారెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా.. దమ్ముంటే సీబీఐ లేదా ఉన్నత స్థాయి అధికారులతో విచారణ చేయించి నిందితులను పట్టుకోవాలని సవాల్ విసిరారు. మరోసారి ఇలాంటి డ్రామాలు ఆడితే నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ​రెండు ఏళ్లు గడుస్తున్నా సొంత డబ్బులతో చేసిన అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించిన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు ఉసిగొల్పడం తగదన్నారు. నీకంటే దారుణమైన భాష మాకు వచ్చని, షబ్బీర్ అలీపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు. ఆధారాలు లేకుండా మా నాయకుని పై ఆయన కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు.

పోటీ అభివృద్ధిలో పడు...

ఎలాంటి మచ్చలేని షబ్బీర్ అలీపై ఆరోపణలు మానుకొని ఆయన చేస్తున్న అభివృద్ధితో పోటీ పడాలని సూచించారు. నియోజకవర్గంలో షబ్బీర్ అలీ చేసిన అభివృద్ధి కంటే ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసి మాట్లాడాలని సూచించారు. అభివృద్ధి అంటేనే షబ్బీర్ అలీ అని, నువ్వు కామారెడ్డికి ఇప్పటి వరకు ఏం చేశావో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు పంచితేనే అభివృద్ధి కాదన్నారు. ఆలీబాబా 16 దొంగలను తయారు చేసుకున్నది నువ్వేనన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామాల్లో పెట్టిన ఫిర్యాదు పెట్టేలతో ఏమి సమస్యలు పరిష్కరించావో చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story