అదృశ్య‌మైన యువకుడి ఆచూకి ల‌భ్యం

by Ratna Kumari |

లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన కొమ్ముల రవి అనే యువకుడు ఈనెల 6న హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలో అదృశ్యమైన విష‌యం తెలిసిందే.

అదృశ్య‌మైన యువకుడి ఆచూకి ల‌భ్యం
X

దిశ‌, లింగంపేట: లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన కొమ్ముల రవి అనే యువకుడు ఈనెల 6న హైదరాబాద్ లోని నాగోల్ ప్రాంతంలో అదృశ్యమైన విష‌యం తెలిసిందే. అయితే ఇవాళ తెల్లవారుజామున తాడ్వాయి పోలీసులకు దొరికాడు. ఈనెల 4న ఇంట్లో నుంచి వెళ్లిన రవి మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి డీసీఎం వ్యాన్ లో పుచ్చకాయలు లోడ్ చేసుకొని హైదరాబాదులో నాగోల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈనెల 06న సాయంత్రం నాగోల్ ప్రాంతంలో అదృశ్య‌మ‌య్యాడు. నాలుగైదు రోజులుగా ఫోన్ ద్వారా రవితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుదరలేదు. దాంతో కుటుంబ సభ్యులు నాగోల్ పోలీస్ స్టేషన్లో రవి అదృశ్యమైన‌ట్టు ఫిర్యాదు చేశారు.

నాగోల్ పోలీసులుమిస్సింగ్ కేసు నమోదు చేశారు. గత 11 రోజులుగా కుటుంబ సభ్యులు పోలీసులు హైదరాబాద్ సిటీలో గాలించినప్పటికిని రవి ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తాడ్వాయి శివారులో పెట్రోలింగ్ నిర్వహి స్తున్న హోంగార్డులు రాజారాం సంజీవ్, దేవి చంద్ కాలినడకన వస్తున్న కొమ్ముల రవి ని గుర్తించి అదుపులోకి తీసుకు న్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అదృశ్యమైన రవిని హోంగార్డులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో రవి కుటుంబ సభ్యులు హోంగార్డులు సంజీవ్, దేవిచంద్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story