అదృశ్యమైన వ్యక్తి .... కుళ్ళిన శరీరంతో విగతజీవిగా కనిపించిన వైనం

by Bhanu |

ఓ వ్యక్తి అదృశ్యమై నందివాడ గ్రామ శివారులో కుళ్ళిపోయిన శరీర భాగాలతో విగత జీవిగా కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది.

అదృశ్యమైన వ్యక్తి .... కుళ్ళిన శరీరంతో విగతజీవిగా కనిపించిన వైనం
X

దిశ, తాడ్వాయి : ఓ వ్యక్తి అదృశ్యమై నందివాడ గ్రామ శివారులో కుళ్ళిపోయిన శరీర భాగాలతో విగత జీవిగా కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్సై రాజయ్య తెలిపిన కథనం ప్రకారం...కామారెడ్డి జిల్లా లింగాపూర్ గ్రామానికి చెందిన గన్సింగ్ (45) గత నెల13న ఎర్రపహడ్ గ్రామంలోని వారి బంధువుల ఇంటికి వచ్చారు.గత కొన్ని రోజుల క్రితం గన్ సింగ్ తలకు బలమైన గాయం తగిలింది.దీంతో అప్పటినుంచి మతిస్థిమితం లేకపోవడంతో బంధువుల ఇంటికి వచ్చిన రోజు మధ్యాహ్నం నుంచి ఆచూకీ లభించలేదు.

దీంతో గన్సింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.అయితే గురువారం నందివాడ గ్రామనికి చెందిన వ్యక్తికి గ్రామ శివారులోని వ్యవసాయ పొలం పక్కన కుళ్లిపోయిన శరీరం భాగాలతో విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై గ్రామస్తులకు,పోలీసులకు సమాచారం ఇచ్చారు.అక్కడికి చేరుకున్న పోలీసులు, పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయిన గన్ సింగ్ కుటుంబ సభ్యులను పిలిపించగా ఘటన స్థలంలో అతను వేసుకున్న తెల్ల చొక్కా,ఆకుపచ్చ లుంగీ,చేతుకు ఉన్న ఉంగరం ఆధారంగా మతిస్థిమితం లేకుండా తప్పిపోయిన వ్యక్తి గన్ సింగ్ గా వారి కుటుంబ సభ్యులు గుర్తించారని అన్నారు.దీంతో మృతుడి కూలిపోయిన శరీర భాగాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారి బంధువులకు అప్పజెప్పడం జరిగిందని ఎస్ఐ రాజయ్య తెలిపారు.


Next Story