- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెరువులో మృతదేహం లభ్యం
ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చెరువులో మృతదేహం లభ్యమైన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

దిశ కమ్మర్ పల్లి: ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చెరువులో మృతదేహం లభ్యమైన సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్ఐ జి. అనిల్ రెడ్డి వివరాల ప్రకారం.. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని వేముల పోశెట్టి (55) ఆదివారం ఇంటి నుంచి సాయంత్రం ఐదు గంటలకు బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోయేసరికి సోమవారం అతని కూతురు వేముల గంగామణి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా మిస్సింగ్ కేసుగా నమోదు చేసినట్టు తెలిపారు. మంగళవారం మండల కేంద్రం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతకగా చెరువులో మృతదేహం కనిపించగా బయటికి తీయించి పంచనామా నిర్వహించారు. పోశెట్టి కొన్ని రోజులు నుండి అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ బాధ తట్టుకోలేక మనస్థాపనకు గురై ఇంటి నుండి బయలుదేరి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. పోశెట్టి శివమును పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.






