ఆర్మూర్ లో యువ‌తి అదృశ్యం

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఆర్మూర్ : మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని మామిడిపల్లి ఏరియా కు చెందిన యువతి అదృశ్య మైనట్లు ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. SHO సత్యనారాయణ గౌడ్

ఆర్మూర్ లో యువ‌తి అదృశ్యం
X

దిశ‌, ఆర్మూర్ : మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని మామిడిపల్లి ఏరియా కు చెందిన యువతి అదృశ్య మైనట్లు ఆర్మూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. SHO సత్యనారాయణ గౌడ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మామిడిపల్లి ఏరియా కు చెందిన గత నెలలో బొమ్మన జలంధర్ కు చెందిన కుమార్తె బొమ్మన జలజ (25), గత సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటల సమయంలో ఆ యువతి స్నేహితురాలు ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళింది. కానీ ఇంటికి తిరిగి రాలేదని, బంధువుల ఇళ్లలో, స్నేహితులను ఆ యువతి ఆచూకీ గురించి అడిగిన కూడా ఎవరి వద్ద ఆచూకి లభించ లేదు. ఆ యువతి ఇంటి నుంచి అదృశ్యమైన రోజు సిమెంట్ కలర్ పంజాబీ డ్రెస్, వైట్ కలర్ లెగ్గిన్ ప్యాంట్ ధరించి ఉన్నదని.. ఆ యువతి ఎత్తు 5.6 ఫీట్లు ఉంటుంద‌ని బొమ్మన జలజ తల్లి గంగా లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకున్నారు. కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ యువతకి సంబంధించిన ఆచూకీ ఎవరికైనా తెలిస్తే..ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ 8712659858, ఆర్మూర్ ఎస్సై 8712578207 నెంబ‌ర్ల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని కోరారు.

Next Story