- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్ బాలిక అదృశ్యం..
మెదక్ జిల్లా హవెలిఘన్పూర్ మండలంలోని వాడి గ్రామపంచాయితీ పరిధిలోని దూప్ సింగ్ తండాకు చెందిన మైనర్ బాలిక దేవసోత్ కళ్యాణి (16) ఈ నెల 9 నుండి కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసునమోదు చేసినట్లు రాజంపేట ఎస్సై రాజు తెలిపారు.

దిశ, రాజంపేట : మెదక్ జిల్లా హవెలిఘన్పూర్ మండలంలోని వాడి గ్రామపంచాయితీ పరిధిలోని దూప్ సింగ్ తండాకు చెందిన మైనర్ బాలిక దేవసోత్ కళ్యాణి (16) ఈ నెల 9 నుండి కనిపించడం లేదని తండ్రి ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసునమోదు చేసినట్లు రాజంపేట ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం సదరు బాలిక రాజంపేట మండలంలోని ఎల్లాపూర్ తాండలో టైలరింగ్ నేర్చుకునేదని అయితే ఈ నెల 9న గుండారం వెళ్తున్నానని చెప్పింది.
తండ్రి విచారించగా అక్కడికి రాలేదని తెలిసింది. బంధువుల ఇళ్లలో సైతం వెతికారని ఇప్పటివరకు ఆచూకీ లభించలేదని ఎత్తు 5, 4 చామన చాయ రంగు గుండ్రని ముఖం కలదని, తెలుగు, లంబడి భాషలలో మాట్లాడుతుందని, ఇంటి నుండి వెళ్లేటప్పుడు బ్లూ కలర్ టాప్ ఎరుపు రంగు లెగ్గిన్ ధరించి ఉందని తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ కింద కేసునమోదు చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.






