- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాను మాల కులస్తుడనే విమర్శలా..? : మంత్రి డాక్టర్ వివేక్ వెంకట స్వామి
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎవరో కావాలనే రెచ్చగొట్టి, తన మీద లేని పోని నిరాధారమైన విమర్శలు చేయిస్తున్నారని మంత్రి డాక్టర్

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఎవరో కావాలనే రెచ్చగొట్టి, తన మీద లేని పోని నిరాధారమైన విమర్శలు చేయిస్తున్నారని మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆవేధన వ్యక్తం చేశారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని శ్రీరామ గార్డెన్ లో ఆదివారం జరిగిన జి. వెంకటస్వామి (కాకా) 96 వ జయంతి వేడుకలు, మాలల ఐక్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తున్నారని వివేక్ ఆవేధన వ్యక్తం చేశారు. లక్ష్మణ్ కుమార్ వచ్చినపుడు అక్కడి నుంచి తాను వెళ్లి పోతున్నానని తనపై అబద్దపు ప్రచారాలు చేస్తున్నారని వివేక్ అన్నారు. మాదిగ కులానికి చెందిన వాడిననే చిన్న చూపుతో వెళ్లిపోతున్నారని నా గురించి విమర్శించడం బాధాకరమన్నారు. అక్టోబర్ 05 జి. వెంకట స్వామి (కాకా) జయంతి వేడుకలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించి జీఓ జారీ చేశారన్నారు. కాకా జయంతి వేడుకలకు సంబంధించి కల్చరల్ డిపార్ట్మెంట్ కార్డు కూడా ప్రింట్ చేయించిందని, ఆ కార్డులో లక్ష్మణ్ పేరు ముద్రించలేదని, తన మాదిగ కులానికి చెందిన వాడినైనందునే నా పేరును కార్డులో ప్రింట్ చేయలేదని లక్ష్మణ్ కుమార్ తనను విమర్శిస్తున్నారని ఆవేధన వ్యక్తం చేశారు.
కులం ఆధారంగా కుట్రలు..
ఇతర మంత్రులెవ్వరినీ విమర్శించకుండా కేవలం తాను మాల కులానికి చెందిన వాడవడంతోనే లక్ష్మణ్ కుమార్ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని మంత్రి వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. మంత్రిగా నేను ఎంతో కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కులం ఆధారంగా తనపై కుట్రలు చేస్తున్నారన్నారు. నిరాధారమైన విమర్శలు చేస్తున్నారని ఆవేధన చెందారు. "జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నాకు మంచిపేరు వస్తుందనే విషయాన్ని జీర్ణించుకోలేక తనపై అనవసర విమర్శలు చేసున్నారని మంత్రి అన్నారు. తన సహచర మంత్రి లక్ష్మణ్ నా పై ఎందుకు విమర్శలు చేస్తున్నారో ఇప్పటికీ తనకు అర్థం కావడంలేదన్నారు. లక్ష్మణ్ వచ్చినపుడు నేను వెళ్ళిపోతున్నాననడం అబద్దం అన్నారు. ఒక సందర్భంలో సమావేశం పూర్తయ్యాక మరో సమావేశానికి తామిద్దరం కలిసే వెళ్లామని వివేక్ అన్నారు. తాను మాల కులానికి చెందిన వాడినవడంతోనే తనపై లక్ష్మణ్ కుల వివక్షతో విమర్శలు చేస్తున్నారేమోనని వివేక్ అన్నారు. నాకు మంత్రి పదవిపై మోజు లేదని, లక్ష్మణ్ ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకయేనన్న విషయాన్ని లక్ష్మణ్ కుమార్ మరిచిపోతున్నారన్నారు. నామీద ఎందుకింత ఈర్ష్య.. అందరితో నేను బాగా కలిసుంటానని, కలిసి కట్టుగా మెదులుతున్నాననేనా" అని వివేక్ ప్రశ్నించారు. నిజామాబాద్ వేదికపై మాలల ఐక్యసదస్సులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.






