- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ స్థంభాలు ఇలా.. మరమ్మత్తులు చేసేది ఎలా ..?
గాంధారి మండలం లోని చద్మల్ గ్రామంలో గల విద్యుత్ ఉప కేంద్రం నుండి నేరల్ గ్రామానికి వెళ్ళే విద్యుత్ లైన్ లు విద్యుత్ ఉప కేంద్రానికి ఆనుకుని ఉన్న మైనింగ్ గుట్టలనుండి వెళ్తున్నాయి..

దిశ, గాంధారి: గాంధారి మండలం లోని చద్మల్ గ్రామంలో గల విద్యుత్ ఉప కేంద్రం నుండి నేరల్ గ్రామానికి వెళ్ళే విద్యుత్ లైన్ లు విద్యుత్ ఉప కేంద్రానికి ఆనుకుని ఉన్న మైనింగ్ గుట్టలనుండి వెళ్తున్నాయి.. అయితే మైనింగ్ కంపెనీ వారు తమ ఇష్టానుసారంగా విద్యుత్ స్థంభాల చుట్టూ మట్టిని తవ్వేయడంతో ఆ స్థంబాలు ప్రమాదకరంగా తయారయ్యాయి.. ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్థంభం పైకి ఎక్కాలంటే తాము సర్కస్ ఫీట్లు చేయాల్సిందే అని విద్యుత్ శాఖ సిబ్బంది వాపోతున్నారు.. మండలములో గత రెండు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో గురువారం నాడు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.. తెగిపోయిన విద్యుత్ లైన్ ద్వారా నౌసిరాం తండా, దుబ్బ తండా, నేరల్ గ్రామం, నాగ్లూర్, కాటేవాడి , పిస్కిల్ గుట్ట గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతుంది.
విద్యుత్ తీగలు తెగిపోవడం తో ఎనిమిది గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న లైన్ మెన్ జ్యోతిష్ తన సిబ్బందితో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరమ్మత్తులు చేపట్టారు.. మరమ్మత్తులు చేయడానికి స్థంభం ఎక్కాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పని చేయాల్సి వస్తుంది అని సిబ్బంది అసిస్టెంట్ లైన్ మెన్ స్వామి గౌడ్, రమేష్, ప్రవీణ్ వాపోయారు.. ఉన్నత అధికారులు స్పందించి మైనింగ్ కంపెనీ వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుకున్నారు.






