కాచాపూర్ సొసైటీ విలీనం రద్దు చేయాలి.. ప్రభుత్వ సలహాదారుకు వినతి పత్రం అందజేత

by Kodari Anjali |

సొసైటీ విలీనం రద్దు చేయాలని కోరుతూ.. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు.

కాచాపూర్ సొసైటీ విలీనం రద్దు చేయాలి.. ప్రభుత్వ సలహాదారుకు వినతి పత్రం అందజేత
X

దిశ, భిక్కనూరు: సొసైటీ విలీనం రద్దు చేయాలని కోరుతూ.. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కు భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామస్తులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి, కాచాపూర్ సొసైటీ సభ్యుల సమావేశ తీర్మానం, ఆర్థిక లావాదేవీల విభజన, ఆయా గ్రామాల రైతులు ఆమోదముద్రలతో కూడిన పత్రాలను వినతిపత్రంతో జతపరిచి అందజేశారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇదివరకటి మాదిరిగా కాచాపూర్ సొసైటీని సపరేట్ గా చేయాలని కోరుతూ వినతి పత్రంలో రిక్వెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాజీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, బైండ్ల సుదర్శన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సింగ్ రావు, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు గాల్ రెడ్డి, మాజీ సర్పంచులు బుల్లె యాదయ్య, బైండ్ల భూపతి, ఉప సర్పంచ్ తొగరి దశరథం, అమృతరావు, సంతోష్, భూమని స్వామి, బైండ్ల శ్రీధర్, లింగం, షేక్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Next Story