- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మూర్‌లో ప్రారంభమైన మీనాక్షి నటరాజన్ పాదయాత్ర..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ లో పాదయాత్ర ప్రారంభమైంది.

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం సాయంత్రం 6 గంటలకు ఆర్మూర్ లో పాదయాత్ర ప్రారంభమైంది. ముందుగా ఆలూరు బైపాస్ రోడ్డు లోని కాంగ్రెస్ పార్టీ జెండాను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఎగరవేసి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పాదయాత్రలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, అధికార పార్టీ ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి దారి పొడవునా ప్రజలు స్వాగతం పలకగా, ప్రజలను ఆప్యాయంగా పలకరించుకుంటూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల , అవి అందుతున్న తీరు గురించి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఆర్మూర్ లో నిర్వహించిన పాదయాత్రకు ఆర్మూర్ నియోజకవర్గంలో పాటు జిల్లా నలుమూలల నుంచి హాజరైన అశేష మద్దతుదారులతో పాదయాత్రలో అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు.
ప్రజల సమస్యలను వింటూ ప్రజలు అందించిన వినతి పత్రాలను పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి సీతక్క, వినయ్ రెడ్డి తదితరులు స్వీకరించారు. ఆలూరు రోడ్డు లో ప్రారంభమైన పాదయాత్ర, కాశి హనుమాన్ వీధి గుండా పెద్ద బజార్, గోల్ బంగ్లా, పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి చౌరస్తాల మీదుగా, క్రికెట్ కోటార్ మూర్ చౌరస్తాల వరకు సాగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు రేకులపల్లి భూపతిరెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీ కాంతారావు, రాష్ట్ర కోపరేటివ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ తాహెర్ బిన్ ఉందన్, సీడ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






