రేకుల‌ప‌ల్లిలో భారీ చోరీ

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని రేకుల‌ప‌ల్లి గ్రామంలో భారీ చోరీ చోటు చేసుకుంది.

రేకుల‌ప‌ల్లిలో భారీ చోరీ
X

దిశ, ధర్పల్లి: మండ‌ల ప‌రిధిలోని రేకుల‌ప‌ల్లి గ్రామంలో భారీ చోరీ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రేకుల‌ప‌ల్లి గ్రామంలో 7 ఇళ్ల‌లో, 2 కిరాణా షాపుల్లో దొంగ‌లు చోరీకి పాల్ప‌డ్డారు. తాళం వేసిన ఇండ్ల‌ను టార్గెట్ చేసుకొని దొంగ‌లు దోచుకుపోయారు. దాదాపు 10 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభ‌ర‌ణాలు, రూ.1ల‌క్ష న‌గ‌దు చోరీకి పాల్ప‌డిన‌ట్టు గ్రామ‌స్తులు తెలిపారు. రేకుల‌ప‌ల్లిలో దొంగ త‌నాలు జ‌ర‌గ‌డంతో గ్రామ‌స్తులు ల‌బోదిబోమంటున్నారు. ఈ ఘ‌ట‌న పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Next Story