తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ.. బంగారు నగలు, నగదు అపహరణ

by Gugulothu.Kavitha |   (  Updated:2025-10-14 03:23:57  IST  )

తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో, గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ.. బంగారు నగలు, నగదు అపహరణ
X

దిశ, భిక్కనూరు: తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో, గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... భిక్కనూరు మండల కేంద్రంలోని చంద్రశేఖర్ శర్మ, మూడు రోజుల క్రితం, ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదులో ఉన్న బంధువుల ఇండ్లకు వెళ్లారు. ఇదే అదనుగా భావించి ఇంటికి వేసిన తాళాలను గుర్తు తెలియని దుండగులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. గుణపంతో బీరువా తాళాలు పగులగొట్టి, సీక్రెట్ అల్మారా లో దాచి ఉంచిన సుమారు 15 తులాల విలువ చేసే బంగారు నగలతో పాటు, 50వేల రూపాయల నగదును అపహరించుకుపోయారు. యజమాని సోదరుడు ఆదివారం ఇంటికి చేరుకుగా, వేసిన తాళాలు పగులగొట్టి, దర్వాజలు తెరిచి ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని హైదరాబాదులో ఉన్న తన అన్నయ్యకు వదినలకు చెప్పడంతో పాటు, స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు స్థానిక పోలీసులు చుట్టుపక్కల ఉన్న సి సి ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. దొంగతనానికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు కావలసిన ఆధారాలన్నింటినీ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

READ MORE ......

సైబర్ నేరగాళ్లే కాదు.. దోస్తులతోను జాగ్రత్త

Next Story