crime news : వివాహిత ఆత్మహత్యాయత్నం.

by Batti.Sumithra |

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది జీవితం పై విరక్తితో ఓ వివాహిత బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అక్కడే ఉన్న యంచ గ్రామస్తులు మహిళను కాపాడారు.

crime news : వివాహిత ఆత్మహత్యాయత్నం.
X

దిశ, నవీపేట్ : కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది జీవితం పై విరక్తితో ఓ వివాహిత బాసర గోదావరిలో దూకి ఆత్మహత్య యత్నం చేయగా అక్కడే ఉన్న యంచ గ్రామస్తులు మహిళను కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి నవీపేట్ మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఓ వివాహిత, కుటుంబ తగాదాలతో మనస్తాపం చెంది సోమవారం నాడు బాసర గోదావరిలో దూకి ఆత్మహత్యకు యత్నం చేసింది. సరిగ్గా అదే సమయానికి అటువైపు నుంచి వస్తున్న యంచ గ్రామానికి చెందిన యువకులు గుమ్ముల నరేష్, ఖలీల్, వినోద్ సదరు మహిళను పట్టుకొని గ్రామానికి తీసుకొచ్చి బాధిత మహిళ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు గ్రామస్తులు తెలిపారు.

Next Story