వైద్యుల నిర్లక్ష్యంతో వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

చాతి నొస్తుందని వస్తే.. వెంటనే వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జీజీహెచ్ లో మంగళవారం చోటు చేసుకుంది.

వైద్యుల నిర్లక్ష్యంతో వ్య‌క్తి మృతి
X

దిశ, కామారెడ్డి టౌన్ : చాతి నొస్తుందని వస్తే.. వెంటనే వైద్యం అందించకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన కామారెడ్డి జీజీహెచ్ లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన శామర్తి బాబు (35) చాతి నొప్పి వస్తుందని ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యం అందడంలో కొంత ఆలస్యం కావడంతో బాబు మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు మీరు వెంటనే వైద్యం అందిస్తే బతికేవాడని, మీ నిర్లక్ష్యం వల్లే బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు వెంటనే జీజీహెచ్ కు చేరుకొని గొడవ సద్దుమ‌నిగేలా చేశారు. మృతునికి భార్య మల్లీశ్వరి, ముగ్గురు కుమార్తెలు, ఒక‌ కుమారుడు ఉన్నారు.

Next Story