మల్లికార్జున్ అప్పా మరణం పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

by Ratna Kumari |

దిశ , నిజాంసాగర్ : మ‌ల్లికార్జున్ అప్పా మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు అని ఎమ్మెల్యే తోట ల‌క్ష్మికాంతారావు పేర్కొన్నారు. బిచ్కుంద‌ మండ‌ల కేంద్రానికి

మల్లికార్జున్ అప్పా మరణం పార్టీకి తీరని లోటు : ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు
X

దిశ , నిజాంసాగర్ : మ‌ల్లికార్జున్ అప్పా మ‌ర‌ణం పార్టీకి తీర‌ని లోటు అని ఎమ్మెల్యే తోట ల‌క్ష్మికాంతారావు పేర్కొన్నారు. బిచ్కుంద‌ మండ‌ల కేంద్రానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మ‌ల్లికార్జున్ అప్ప షెట్కార్ మంగ‌ళ‌వారం అకాల మ‌ర‌ణం చెందారు. దీంతో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ వార్త‌ను తెలుసుకొని వెంట‌నే మ‌ల్లికార్జున్ అప్పా నివాసానికి చేరుకున్నారు. అప్పా భౌతికకాయనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం పాడే మోశారు. నియోజకవర్గ అభివృద్ధిలో, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు.

ప్రజలతో నేరుగా మమేకమై సేవలో నిమగ్నమైన నిజమైన ప్రజా నాయకుడు అన్నారు. తాను ఎమ్మెల్యేగా నిర్వహించిన ప‌లు కార్యక్రమాలలో ఆయన సహకారం, మార్గదర్శనం మరువలేనివి అన్నారు. ఈ దుఃఖ సమయంలో భగవంతుడు వారి కుటుంబానికి, బంధువులకు, సన్నిహితులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ అంతిమ యాత్రలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార,డోంగ్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజు పటేల్, నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, మద్నూర్ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ పాల్గొన్నారు.

Next Story