బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హన్మాండ్లు

బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు మల్లన్న
X

దిశ, కామారెడ్డి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే దమ్మున్న నాయకుడు తీన్మార్ మల్లన్న అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల హన్మాండ్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్, కో కన్వీనర్ నియామకం కోసం దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని, శనివారం రాష్ట్ర కమిటీ చర్చించి నియామకం చేపడతామన్నారు. కన్వీనర్, కో కన్వీనర్లు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పని చేయాల్సి ఉంటుందన్నారు. నాడు గడీల పాలనను ఏ విధంగా తరిమికొట్టామో అలాగే నేడు రెడ్డి, రాజులు గద్దెనెక్కకుండా ఆపాలన్నారు. నాటి పాలకులు లక్షల కోట్ల అప్పులు తెచ్చి బీసీలపై ఉక్కుపాదం మోపారని తెలిపారు. రాజ్యాధికార పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని, అధికారంలోకి వస్తే బీసీలకు లక్ష కోట్లు కేటాయిస్తామని, తద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 2028-29 సంవత్సరంలో మల్లన్ననే సీఎం అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా కొత్త పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజ్యాధికార పార్టీ నిజామాబాద్ పట్టణ అధ్యక్షుడు దొంతుల సందీప్, నాయకులు షేక్ ఖాసీం ఖాద్రి, నవీన్ ముదిరాజ్, టెడ్డు రవి పాల్గొన్నారు.

Next Story