స్కూటీని ఢీకొన్న లారీ...సడన్ బ్రేక్ వేయడంతో

by velandi.Saikiran |

ఇటీవల కురిసిన వర్షాలకు... హైవేపై పెద్ద గుంతలు పడగా, స్కూటీ గుంతలో ఇరుక్కుపోయి ప్రమాదానికి గురై ఒకరు తీవ్రంగా గా

స్కూటీని ఢీకొన్న లారీ...సడన్ బ్రేక్ వేయడంతో
X

దిశ, భిక్కనూరు : ఇటీవల కురిసిన వర్షాలకు... హైవేపై పెద్ద గుంతలు పడగా, స్కూటీ గుంతలో ఇరుక్కుపోయి ప్రమాదానికి గురై ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం జంగంపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా వేల్పూర్ కు చెందిన ఏలేటి శ్రీకాంత్ రెడ్డి కొంపల్లి లో జాబ్ చేస్తాడు. అయితే తన స్వగ్రామం నుంచి స్కూటీపై హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు. ఆర్టిఏ చెక్ పోస్ట్ దాటిన తర్వాత 44వ హైవేపై ప్రమాదకరంగా మారిన గుంతలో పడి, వెనకాలే వస్తున్న లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనకాలే వస్తున్న కారు, దాని వెనకాలే వస్తున్న మరో లారీ ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆయా వాహనాల ముందు భాగం దెబ్బతింది. అటు గాయ‌ప‌డిన వ్య‌క్తిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

Next Story