రామర్తి చెరువులో భూ వివాదంపై లోకాయుక్త విచారణ..

by Disha Web Desk 20 |
రామర్తి చెరువులో భూ వివాదంపై లోకాయుక్త విచారణ..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లి (రామర్తి చెరువు) శిఖంలో భూ వివాదంపై లోకాయుక్త విచారణ జరిపింది. రామర్తి చెరువు శిఖం భూమిలో 213, 214 సర్వే నంబర్ లలో ఉన్న భూమి హక్కుదారులమని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పోలీసు కేసులు, రెవెన్యూలో ఫిర్యాదులు చేసుకున్నా తేలకపోవడంతో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మంగళవారం లోకాయుక్త డైరెక్టర్ (ఇన్వేస్టిగేషన్)తిరుపతి వెంకట్ రావు, ఎన్. విద్యాసాగర్ (ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్) తో పాటు నిజామాబాద్ ఆర్డీవో రవి, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు సత్యనారాయణ, నిజామాబాద్ నార్త్ ఎమ్మార్వో సుదర్శన్, సర్వేయర్, పోలీసుల ఆధ్వర్యంలో రామర్తి చెరువు శిఖం భూమిలో లోకాయుక్త విచారణ జరిపింది.

స్థానికంగా ఉన్నహద్దులను పరిశీలించి అక్కడ ఉన్న రెవెన్యూ, నీటి పారుదల శాఖల మ్యాప్ లను పరిశీలించారు. అనంతరం నిజామాబాద్ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రామర్తి చెరువు శిఖం భూమిలో ఫిర్యాదు నేపథ్యంలో స్థానికంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించినట్లు తెలిపారు. సంబంధిత నివేదికను లోకాయుక్తకు సమర్పిస్తామని లోకాయుక్త విచారణాధికారులు తెలిపారు.

30 ఎకరాల శిఖం భూమిలో కబ్జాలు..

నిజామాబాద్ నగర శివారులోని రామర్తి చెరువు శిఖం భూమిలో వివాదాస్పద భూములను లోకాయుక్త విచారణ చేయడం కలకలం రేపింది. నిజాంకాలం నుంచి నగరం చుట్టు ఉన్న ఆటవి ప్రాంతంనుంచి వచ్చిన వర్షం నీటిని ఓడీసీ పట్టినాడు సాగు జరిగేది. ఆలా ఎర్పడిందే రామార్తి చెరువు. నగరంలోని బోదన్ రోడ్డును అనుకుని 30 ఎకరాల విస్థిర్ణంలో నీటి నిలువతో సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందేది. అలాంటి భూమి కబ్జా కోరల్లో చిక్కుకుంది. ప్రస్తుతం దాని శిఖం ఆరు ఎకరాలకు మించి లేకుండా ఉంది. ఇప్పటికి కబ్జాలో ఉండడంతో మొన్నటికి మొన్నబల్దియా అధికారులు అదికాస్తా మిగిలింది. మిగిలిన 20 ఎకరాల విస్తీర్ణం వరకు కబ్జాకు గురి కాగా అక్కడే వివాదాలు తలెత్తుతున్నాయి. చెరువు శిఖం అవుతల వైపు ఉన్న సర్వేనంబర్లు చెరువులో చూపుతూ భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. రెవెన్యూ శాఖ నిర్లక్ష్యానికితోడు అవినీతి కారణంగానే చెరువు శిఖం కుచించుకపోయింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed