- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగంపేట కాలేజీలో తగ్గిన ఉత్తీర్ణత
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు.

దిశ, లింగంపేట : ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 152 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 29 మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. సెకండ్ ఇయర్ లో 106 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 29 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 258 మంది బాలబాలి కలు పరీక్షలు రాయగా కేవలం 58 మంది ఉత్తీర్ణత సాధించారు.
నాడు ప్రథమం.. నేడు అథమం
లింగంపేట మండల కేంద్రంలో 2001 లో ప్రభుత్వం జూనియర్ కళాశాల ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గత ఏడాది వరకు ఇంటర్ పరీక్షల్లో శాతం మెరుగ్గా ఉన్నది. 2025 పరీక్షల్లో 97% ఉత్తీర్ణత సాధించి కామారెడ్డి జిల్లాలోనే లింగంపేట కాలేజ్ టాప్ గా నిలిచింది. కానీ ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో విద్యార్థిని విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణత సాధించలేక పోయారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 19 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 27% ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫస్టియర్ బైపిసి విభాగంలో సానియా మహేష్ అనే విద్యార్థిని 440 మార్కుల గాను 425 మార్కులు సాధించి టాపర్ గా నిలువగా.. సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో కలాల్ మనోజ్ఞ అనే విద్యార్థిని 1000మార్కులకు 834 మార్కులు సాధించి కాలేజ్ టాపర్ నిలిచింది. గత 25 ఏళ్లుగా 90 శాతం ఉత్తీర్ణత సాధిస్తూ జిల్లాలోనే టాప్ కాలేజ్ గా నిలువగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పాతాళానికి పడిపోవడం పట్ల విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.






