- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ఎత్తివేత
దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆదివారం ప్రాజెక్టు ఒక

దిశ, నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఆదివారం ప్రాజెక్టు ఒక వరద గేటును ఎత్తి దిగువకు 4,048 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి పారుదల శాఖ ఏఈ సాకేత్ తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టులోకి 4,048 ఇన్ ఫ్లో గా వచ్చి చేరుతుందని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,405.00 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1405.00 అడుగుల (17.802 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు ఒక వరద గేట్ ను ఎత్తివేసి 4,048 క్యూసెక్కుల వరద నీటిని మంజీరా నదిలోకి నీటిని వదిలి పెడుతున్నట్లు ఏఈ తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరద నీటితో ప్రవహిస్తున్నందున ప్రజలు, రైతులు, పశువుల గొర్రెల కాపరులు మంజీరా వైపు వెళ్లే నీటి ప్రవాహంలోకి కాలువలలోకి దిగరాదని అప్రమత్తంగా ఉండాలని కోరారు. పర్యాటకులు ప్రాజెక్టు అందాలను తిలకించే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద గేట్ల నీటి ప్రవాహం దగ్గరకు గాని లోతట్టు ప్రాంతాల వైపు ఎవరు వెళ్లకూడదని పర్యాటకులకు సూచించారు.






