దళారీ వ్యవస్థను రూపుమాపుతాం

by Sridhar Babu |   (  Updated:2023-10-25 09:44:23  IST  )

దళారీ వ్యవస్థను రూపుమాపే విధంగా పోరాటం చేస్తామని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

దళారీ వ్యవస్థను రూపుమాపుతాం
X

దిశ, భిక్కనూరు : దళారీ వ్యవస్థను రూపుమాపే విధంగా పోరాటం చేస్తామని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన 487 మంది కాటిపల్లి వెంకటరమణారెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వారందరికీ కండువాలు మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే గ్రామాల్లోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చేస్తానన్నారు. పెన్షన్, రేషన్ కార్డు వంటి

సమస్యలే కాకుండా, వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. ముఖ్యంగా ధరణి సమస్యలను పరిష్కరిస్తామని, అన్ని వ్యవస్థలలో దళారీ వ్యవస్థను రూపుమాపే విధంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రెడ్డి గారి రమేష్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు వలకొండ రవీందర్ రెడ్డి, లింగంపేట యాదగిరి గౌడ్, గోల్కొండ శ్రీనివాస్ రెడ్డి, ఉప్పరి రమేష్, గోల్కొండ నర్సింహారెడ్డి, గరిగంటి నర్సింలు, నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story