రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ దుర్మరణం

by Ratna Kumari |

దిశ‌, మాచారెడ్డి : రోడ్డు ప్ర‌మాదంలో ఓ లెక్చ‌ర‌ర్ దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి

రోడ్డు ప్రమాదంలో లెక్చరర్ దుర్మరణం
X

దిశ‌, మాచారెడ్డి : రోడ్డు ప్ర‌మాదంలో ఓ లెక్చ‌ర‌ర్ దుర్మ‌ర‌ణం పాలైన ఘ‌ట‌న కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండ‌లం నెమ‌లిగుట్ట తండాకు చెందిన మాలోతు శ్రీనివాస్(30) హైద‌రాబాద్ లోని సీఎంఆర్ క‌ళాశాల‌లో లెక్చ‌ర‌ర్ గా విధులు నిర్వ‌హిస్తున్నాడు. దీపావ‌ళి పండుగ‌కు సొంతూరుకి వ‌చ్చాడు. తిరిగి సొంతూరు నుంచి హైద‌రాబాద్ ఇవాళ బ‌య‌లేదేరాడు. హైద‌రాబాద్ నుంచి కామారెడ్డి వైపు వ‌స్తున్న ట్రావెల్స్ బ‌స్సు బ్రేక్ ఫెయిల్ కావ‌డంతో డివైడ‌ర్ దాటి రావ‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. మాలోతు శ్రీనివాస్ హెల్మెట్ ధ‌రించిన‌ప్ప‌టికీ త‌ల‌కు బ‌ల‌మైన గాయం కావ‌డంతో అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. మృతునికి భార్య‌, ఇద్ద‌రూ పిల్ల‌లు ఉన్నారు. పండుగ వేళ‌.. ఆ ఇంట్లో విషాదం నిండింది. స్థానికులను కంట త‌డి పెట్టించింది.

Next Story