ఆర్మూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో లాఠీచార్జి

by velandi.Saikiran |

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత

ఆర్మూర్ గణేష్ నిమజ్జన శోభాయాత్రలో లాఠీచార్జి
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో శనివారం రాత్రి ప్రారంభమైన గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో ఆదివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జ‌నంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు నిర్వహిస్తున్న పోలీసులు.... లాఠీలకు పని చెప్పారు. ఆదివారం ఉదయం కంటేశ్వర యూత్ గణేష్ మండలి వద్ద ఏఎస్ఐ రాందాస్ దురుసుగా వ్యవహరిస్తూ అసభ్య పదజాలంతో దూషించాడని గణేష్ మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో గణేష్ మండప నిర్వాహకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ త‌రుణంలోనే పోలీసులు లాఠి చార్జి చేపట్టారు. దీంతో కోపోద్రక్తులైన కంటేశ్వర యూత్ గణేష్ మండలి సభ్యులు పెద్ద బజారులో గల రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు రెండు గంటల పాటు రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. దీంతో అక్కడికి చేరుకున్న ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ బైఠాయించిన గణేష్ మండప నిర్వాహకులను సముదాయించి రోడ్డును క్లియర్ చేశారు.

Next Story