- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పు చేస్తే ఐదేళ్లు గోస పడాల్సిందే : కేటీఆర్
మున్సిపల్ ఎన్నికలు ఎల్లారెడ్డి నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని, ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఐదు సంవత్సరాల పాటు బాధపడాల్సి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.

దిశ, తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మున్సిపల్ ఎన్నికలు ఎల్లారెడ్డి నియోజకవర్గ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టమని, ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఐదు సంవత్సరాల పాటు బాధపడాల్సి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. 420 అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గద్దెనెక్కిన తర్వాత ఎల్లారెడ్డి ప్రజలకు చేసిందేమిటి అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ.. రైతుబంధు ద్వారా 1.09 లక్షల మంది రైతులకు, రైతుబీమా ద్వారా 2,500 మందికి, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 2,139 మందికి లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు. ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎందుకు కుంటుపడుతున్నాయని నిలదీశారు. ఎల్లారెడ్డిలో పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి అతి చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్‌లను చూసుకుని ఎగిరెగిరి పడుతున్న అధికారుల తోకలు కట్ చేస్తాం.మా తమ్ముళ్ల పై చేయి వేస్తే ఉరికించి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని హెచ్చరించారు.తిరిగి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్,పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.






