- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎడారిని తలపిస్తున్న కన్నాపూర్ చెరువు
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలోని చెరువు కట్ట తెగిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలోని చెరువు కట్ట తెగిపోయింది. దీంతో కన్నాపూర్ చెరువు ఎడారిని తలపిస్తోంది. గ్రామంలోని 500 ఎకరాల పెద్ద చెరువు కట్ట తెగిపోవడంతో అందులోని నీళ్లన్నీ పంట పొలాల్లోకి ప్రవహించాయి. దీంతో పొలాలు పూర్తిగా ఇసుకతో కప్పబడి వాగును తలపిస్తున్నాయి.
వరద దాటికి ప్రధాన రహదారి బ్రిడ్జి సైతం కూలిపోవడంతో ప్రజలు ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని గడుపుతున్నారు. వర్ష బీభత్సంతో గ్రామంలోని 15 ఇళ్లు కూలిపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని చెబుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. నిజ్జన రమేష్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జిల్లా కలెక్టర్ గ్రామానికి వస్తే స్థానిక సమస్యలు తెలుస్తాయని అన్నారు.
గ్రామానికి బ్రిడ్జి తెగిపోవడం వల్ల రాకపోకలు బంద్ అయ్యాయని చెప్పారు. వెంటనే చెరువు కట్టను నిర్మించాలని, అధికారులు త్వరగా పనులు పూర్తి చేయాలని కోరారు. కట్ట పనులు త్వరగా పూర్తి చేస్తేనే రాబోయే వర్షాలకు చెరువులో నీరు నిలుస్తుందని అన్నారు. లేదంటే రైతులు రెండు పంటలను నష్టపోతారని తెలిపారు. అంతే కాకుండా గ్రామానికి స్పెషల్ ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు నిజ్జన విట్టల్, స్థానికులు కాశీరం, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.






