గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య

by Bhanu |

మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన జక్కుల రాజ్ కుమార్ (23) పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి. అనిల్ రెడ్డి బుధవారం తెలిపారు.

గడ్డి మందు తాగి యువకుడు ఆత్మహత్య
X

దిశ, కమ్మర్ పల్లి: మండలంలోని ఇనాయత్ నగర్ గ్రామానికి చెందిన జక్కుల రాజ్ కుమార్ (23) పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై జి. అనిల్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. జక్కుల రాజ్ కుమార్ పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో జీవితం పై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా చికిత్స నిమిత్తం నిజామాబాద్ మనోరమ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ జక్కుల రాజ్ కుమార్ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడని అని తెలిపారు. మృతుడి యొక్క తండ్రి రాజన్న దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు.

Next Story