- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రస్థాయి యోగా చాంపియన్షిప్ కామారెడ్డి కైవసం
ఈ నెల 5,6,7 తేదీల్లో నిర్మల్‌లో నిర్మల్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్

దిశ, కామారెడ్డి: ఈ నెల 5,6,7 తేదీల్లో నిర్మల్‌లో నిర్మల్ జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ సహకారంతో 6వ రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో కామారెడ్డి జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ విద్యార్థులు (కేజీబీవీ విద్యార్థులు) పలు విభాగాలలో విజేతలుగా నిలవడంతో పాటు రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ ట్రోఫీని మొదటిసారిగా కామారెడ్డి జిల్లాకు సాధించుకు తెచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారి కోచ్‌లకు కామారెడ్డి జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగా రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘుకుమార్ తో పాటు జిల్లా యోగ సభ్యులు అభినందనలు తెలిపారు.
సబ్ జూనియర్ విభాగంలో
-జోష్ణ–సునీత రిధమిక్ పెయిర్‌లో గోల్డ్ మెడల్
-బి.నికిత ఆర్టిస్టిక్ సింగిల్ సబ్ జూనియర్ గర్ల్స్‌లో సిల్వర్ మెడల్
-కవిత లెగ్ బ్యాలెన్సింగ్‌లో సిల్వర్ మెడల్
-సిందుజా హ్యాండ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్ మెడల్
-విగ్నేశ్వరి సుపైన్ ఇండివిడ్యువల్‌లో గోల్డ్ మెడల్
-సిరిష –వైష్ణవి ఆర్టిస్టిక్ పెయిర్‌లో సిల్వర్ మెడల్
-అంజలి ట్రెడిషనల్ విభాగంలో ఐదవ స్థానం
-విఘ్నేష్ సబ్ జూనియర్ బాయ్స్ సుపైన్‌లో 1బ్రాంజ్
జూనియర్ విభాగంలో
-సహస్ర–సరస్వతి రిధమిక్ పెయిర్‌లో ప్రథమ స్థానం
-సహస్ర ట్విస్టింగ్ బాడీలో గోల్డ్, లెగ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్,
-సరస్వతి బ్యాక్ బెండింగ్‌లో గోల్డ్, ఆర్టిస్టిక్ సింగిల్‌లో బ్రాంజ్
-స్రవంతి–శైలిశ్రీ ఆర్టిస్టిక్ పెయిర్‌లో గోల్డ్
-శ్రావంతి హ్యాండ్ బ్యాలెన్సింగ్‌లో గోల్డ్
-కృప సుపైన్ ఇండివిడ్యువల్ విభాగంలో గోల్డ్
-హరిణి ట్విస్టింగ్ బాడీ విభాగంలో బ్రాంజ్ మెడల్. .
నవదీప్ కు జూనియర్ బాలుర విభాగంలో బ్యాక్ బెండింగ్ లో 1గోల్డ్, హ్యాండ్ బ్యాలెన్స్ లో 1గోల్డ్, ఆర్టిస్టిక్ సింగల్ లో 1బ్రాంజ్, అన్ని కలిపి 12గోల్డ్ 3సిల్వర్ 4బ్రాంజ్ మొత్తము 19 మెడల్స్ సాధించి కామారెడ్డి జిల్లాకు మొదటిసారి రాష్ట్ర ఛాంపియన్షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.






