- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త హత్యకు భార్యకుట్ర
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన ఓ భార్య అతడిని ఎలాగైనా అంతమోందించాలని పథకం వేసింది.

దిశ, కామారెడ్డి : తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన ఓ భార్య అతడిని ఎలాగైనా అంతమోందించాలని పథకం వేసింది. పథకం బెడిసి కొట్టడంతో భార్యతో పాటు హత్యకు యత్నించిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామానికి చెందిన సాడెం కుమార్ మెదక్ మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అల్వాల్ కు చెందిన కాంపల్లి మహేష్ రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లి గ్రామ సమీపంలోని లలితమ్మ ఆలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కుమార్ భార్య రేణుకతో మహేష్ కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ అక్రమ సబంధానికి కుమార్ అడ్డుగా ఉన్నాడని భావించిన రేణుక, మహేష్ తో కలిసి కుమార్ ను అంతమొందించాలని భావించారు. కుమార్ ను చంపితే అతని ఉద్యోగం రేణుకకు రావడంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ తో రాష్ట్రం వదిలి వెళ్లిపోయి హాయిగా జీవించాలనుకున్నారు.
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్త హత్యకు భార్యకుట్రఈ కుట్ర కోసం అల్వాల్ కు చెందిన మహమ్మద్ అశ్వక్ కు 15 లక్షల సుఫారీ ఇచ్చేందుకు ఒప్పుకుని అతని అనుచరులైన ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్ లకు రెండు లక్షలు అడ్వాన్సుగా ఇచ్చారు. కుమార్ ఏ దారిన వెళ్తాడో ఒకరోజు ముందుగానే రెక్కీ నిర్వహించారు. పథకం ప్రకారం ఈ నెల 21 న ఉదయం 6 గంటలకు భర్త ఇంటినుంచి బయకుదేరగానే సమాచారాన్ని మహేష్ కు చేరవేయగా సుఫారీ గ్యాంగును అప్రమత్తం చేసాడు. దాంతో ఫరీద్ పేట శివారులోని సోలార్ ప్లాంట్ వద్ద కాపు కాసి కుమార్ ను వెంబడించి రాడ్లు, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ సమయంలో కారు రావడాన్ని గమనించి పారిపోయారు. రక్తపు మడుగులో ఉన్న కుమార్ ను కారులో ఉన్న ఇద్దరు గమనించి పోలీసులకు సమాచారమివ్వడంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో మహేష్, రేణుక, అల్వాల్ కు చెందిన మహ్మద్ అశ్వక్ అహ్మద్, మహమ్మద్ ముబిన్, మహమ్మద్ యాకుబ్ అలియాస్ అమీర్ లను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి కారు, ఆటో, గొడ్డలి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు మొబైల్స్ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండుకు తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. కేసును ఛేదించడంలో చురుగ్గా పనిచేసిన రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్, క్రైం సిబ్బందిని ఎస్పీ అభినందించారు.






