- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక, ఆర్థిక స్థితి గతులను అర్థం చేసుకోవడానికే జనహిత పాదయాత్ర : షబ్బీర్ అలీ
పాదయాత్ర ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ

దిశప్రతినిధి, నిజామాబాద్ : పాదయాత్ర ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ లు జనహిత పాదయాత్రను ప్రారంభించారని రాష్ట్రప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులోని దోభీ ఘాట్ నుండి ఆర్మూర్ పట్టణం వరకు జరిగిన పాదయాత్రలో మీనాక్షి నటరాజన్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లతో పాటు మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ.. వెనకబడిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించడంలో తెలంగాణ దేశంలోనే ఒక నమూనా అన్నారు.
నాలుగు వేల కి.మీ లకు పైగా చేసిన పాదయాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల మనసులను అర్థం చేసుకున్న రాహుల్ గాంధీని అనుసరించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని షబ్బీర్ అన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకోవాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారన్నారు. ఆయన పిలుపును అందుకుని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు శ్రీకారం చుట్టారని ఆయనన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు, అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా పాలన అందివ్వడానికే ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు షబ్బీర్ అలీ అన్నారు.






