- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళను వేధించిన కేసులో ఇద్దరికీ జైలు శిక్ష
మహిళను వేధింపుల కేసులో ఇద్దరికీ జైలు శిక్ష| విధించిన సంఘటన భీమ్ గల్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

దిశ, మోర్తాడ్ : మహిళను వేధింపుల కేసులో ఇద్దరికీ జైలు శిక్ష| విధించిన సంఘటన భీమ్ గల్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. రాజారాంనగర్ కాలనీకి చెందిన ఓ మహిళ పై అదే కాలనీకి చెందిన వేముల రాఖేష్, వెంకయ్య లు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో జనవరి 19, 2023న ఆ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు కేసును దర్యాప్తు చేసి చార్జ్ షీటు దాఖలు చేశారు. అనంతరం కేసును విచారించిన జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు రాఖేష్, వెంకయ్య లను దోషులుగా తేల్చింది. రాఖేష్ కి సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.4,200 జరిమానా, వెంకవ్వకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.700 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లు సచిన్, సాగర్, విక్రమ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్‌లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.






