తెలంగాణ కేసీఆర్ జాగిరా ?

by Disha Web Desk 15 |
తెలంగాణ కేసీఆర్ జాగిరా ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణలో రాబోయే రోజులలో జరిగే మార్పులకు ప్రధాని మోడీ పర్యటనతో రాజకీయాలకు నూతన దిశ నిర్ధేశంతో పాటు పార్టీ తరుపు ప్రచారానికి శ్రీకారం చూడతారని కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే ప్రధాని మోడీ బహిరంగ సభ ప్రాంగణాన్ని కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. జిల్లా నాయకులతో జీజీ కళాశాల మైదానంలో విలేఖరులతో మాట్లాడుతూ అక్టోబర్ 1న పాలమూరు లో పర్యటన, 3న ఇందూరు లో ప్రధాని పర్యటన ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం తరపున పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్దాపన చేస్తారు అన్నారు. నిజామాబాద్ వేదికగా ఎన్టిపిసి కి సందించి 6 వేల కోట్ల విలువైన పవర్ ప్రాజెక్టును పర్చువల్ పద్ధతిలో ప్రారంభించి జాతీకి అంకితం చేస్తారని అన్నారు. ఆనంతరం బహిరంగ సభ లో పాల్గొంటారు అని తెలిపారు.

ఉత్తర తెలంగాణ లో బీజేపీది కీలక పాత్ర అని, అదేవిధంగా బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలో కూడా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు అని, ఇటీవల అమిత్ షా ఖమ్మం పర్యటనతో అది రుజువు అయిందని అన్నారు. ఈ సభ దిశ నిర్దేశం వంటిందని, రానున్న రోజుల్లో తెలంగాణలో అమిత్ షా, నడ్డా తో పాటు పలువురు ప్రముఖులు పర్యటిస్తారు అని తెలిపారు. అక్టోబర్ 2 నుంచి బీజేపీ ఎన్నికల సన్నాహలు షురూ అవుతాయని పేర్కొన్నారు. ప్రధాని మోడీ రాష్ర్ట పర్యటనకు వచ్చే ముందు హమీల సంగతి తెల్చాలన్న కేటీఆర్, కవితలపై కిషన్ రెడ్డి పైర్ అయ్యారు. ముందు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేశాడో చెప్పాలి అని నిలదిశారు. రాష్ర్టంలో నిరుద్యోగుల కోసం టీఎస్ పీఎస్ సీ నోటిపికేషన్ లు విడుదల చేసి ఎందుకు అన్ని ఉద్యోగాలు భర్తీ చెయ్యలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట ఉపాధ్య క్షులు యెండల లక్ష్మి నారాయణ, జిల్లా అధ్యక్షులు లక్ష్మి నర్సయ్య, రాష్ర్ట కార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు దన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Next Story

Most Viewed