నా కొడుకును కేజ్రీవాల్ నుంచి దూరం చేసేందుకు బీజేపీ కుట్ర : బిభవ్ తండ్రి

by Shamantha N |
నా కొడుకును కేజ్రీవాల్ నుంచి దూరం చేసేందుకు బీజేపీ కుట్ర : బిభవ్ తండ్రి
X

దిశ, నేషనల్ బ్యూరో: భిభవ్ కుమార్ అరెస్టు పై ఆయన తండ్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ నుంచి తన కుమారుడ్ని దూరం చేసేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు భిభవ్ తండ్రి మహేశ్వర రాయ్. భిభవ్ తో తాను మాట్లాడానని జాతీయ మీడియాకు తెలిపారు. స్వాతిపై దాడి ఘటన జరిగినప్పుడు.. భిభవ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నాడని తెలిసిందన్నారు. భిభవ్ నేచర్ గురించి ఎవ్వరైనా చెప్తారని.. అతను ఎప్పుడూ హింసాత్మకంగా వ్యవహరించలేదని వివరించారు. స్వాతి మలివాల్ కేజ్రీవాల్ నివాసానికి ఏదో పెద్దపని చేసేందుకు వచ్చారని భిభవ్ తనతో చెప్పారని అన్నారు. స్వాతిని భిభవ్ ముట్టుకోనేలేదని.. ఆమెను సెక్యూరిటీ గార్డులే బయటకు పంపారని మహేశ్వర్ రాయ్ అన్నారు.

ఇకపోతే, ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి జరిగిన 5 రోజుల తర్వాత శనివారం భిభవ్ ను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించినప్పటికీ భిభవ్ కు నిరాశ తప్పలేదు. భిభవ్ అరెస్టు, ఆప్ నేతల అరెస్టులకు నిరసనగా ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ‘జైల్ భరో’‌ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం పిలుపునిచ్చారు.

Next Story