ప్రలోభాలు షురూ! కుల,యువజన సంఘాల వారీగా దావత్‌లు

by Ajay Maddhiboyina |

పోలింగ్‌కు వార్డుల్లో అభ్యర్థులు ఓటర్లను బుట్టలో వేసుకునే కార్యాచరణ మొదలుపెట్టారు. జిల్లాల్లో ఇంటింటి ప్రచారాలు ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు సాయంత్రం మద్యం, చికెన్‌ పంపిణీ చేస్తున్నారు.

ప్రలోభాలు షురూ! కుల,యువజన సంఘాల వారీగా దావత్‌లు
X

పోలింగ్‌కు వార్డుల్లో అభ్యర్థులు ఓటర్లను బుట్టలో వేసుకునే కార్యాచరణ మొదలుపెట్టారు. జిల్లాల్లో ఇంటింటి ప్రచారాలు ఒకవైపు కొనసాగిస్తూనే మరోవైపు సాయంత్రం మద్యం, చికెన్‌ పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ మందు, చికెన్‌ పంపిస్తున్నారు. అంతేకాకుం డా గల్లీల్లో యూత్‌కు, సంఘాలకు సాయంత్రం వేళ దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక గల్లీలో ఒక పార్టీ నాయకులు మద్యం, చికెన్‌ పంచారనే సమాచారం రాగానే, ఇంకోపూట ఇంకో పార్టీ అభ్యర్థి తనవాటా మద్యం, చికెన్‌ పంపిణీ చేస్తున్నారు. అభ్యర్థులందరూ ఈ పంపిణీకి తెరదీయడంతో వార్డుల్లో, గల్లీల్లో రాత్రి కాగానే పార్టీల సందడి కొనసాగుతోంది. ఒక్కోపార్టీ అభ్యర్థి నుంచి పోలింగ్‌ తేదీ నాటికి మూడు, నాలుగు పర్యాయాలైనా మద్యం, మందు పంపిణీ జరుగుతున్న పరిస్థితి గట్టిపోటీ ఉన్నవార్డుల్లో కనిపిస్తోంది. యూత్‌కు దావత్‌లతోపాటు క్రికెటు కిట్లు, డ్రస్సులు పంపిణీ చేస్తున్నారు. మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రలోభాలపర్వం మొదలైంది. ఒకవైపు పగటివేళ ఇంటింటి ప్రచారాలు సాగిస్తూ, రాత్రికి పంపకాలు మొదలుపెట్టారు. గల్లీల్లో ఎక్కడికక్కడ దావత్‌లు, పార్టీలు ఊపందుకున్నాయి. మునిసిపాల్టీల్లో తాయిలాల పంపిణీలు కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలే కాకుండా పోటీలో ఉన్న అభ్యర్థులంతా ఖర్చుకు వెరవకుండా దావత్‌లు షురూ చేయడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా కనిపిస్తోంది.

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఓటర్లను మభ్య పెట్టేందుకు ప్రలోభాలు ప్రారంభ మయ్యాయి. ఆర్మూర్ మున్సిపల్ లో ఓటర్లను ఆకట్టుకునేందుకు చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. కుల సంఘాల, యువజన సంఘాల వారీగా మద్యంతో విందును ఏర్పాటు చేస్తూ దావతులను పోటీ చేసే అభ్యర్థులు ఇస్తున్నారు. ఆదివారం ఉండడంతో మున్సిపల్ ఎన్నికకు సమయం దగ్గర పడడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు మున్సిపల్ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను నయానో భయాన్ను మచ్చిక చేసుకునేందుకు కిలో చొప్పున మటన్ చికెన్ ప్యాకెట్లను వారి మద్దతుదారులు, అనుచర ద్వారా ఓటర్ల ఇంటికి పార్సల్లు చేస్తున్నారు. పురుష ఓటర్లకు మద్యంతో విందు దావతులను ఏర్పాటు చేయడంతో పాటు మహిళ ఓటర్లకు లీటర్ కూల్ డ్రింక్ బాటిల్స్ లను వాయు వారి ఇండ్లకు పంపుతున్నారు.

మున్సిపల్ ఎన్నికకు ఆర్మూర్ మున్సిపల్ లో మంత్రుల, ఎమ్మెల్యే, అగ్రనేతల, నియోజకవర్గ నాయకులు ప్రచారానికి వచ్చిన సందర్భంలో ప్రజల సమీకరణకు ఒక్కొక్కరికి 200 నుంచి 300 వరకు మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు అందజేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ లో పలు వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆదివారం ఉదయం నుంచే చికెన్ మటన్ ల పార్సలను ఇండ్లకు పంపిణీ చేయడం పట్ల ఎన్నిక జరిగే వరకు ఇంకా మూడు రోజులు ఏ స్థాయిలో ఓటర్లను మభ్య పెట్టేందుకు పోటీ చేసే అభ్యర్థులు పంపిణీ చేయనున్నారో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. దీంతోపాటు వార్డుల్లో ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసే పలువురు ఓటర్లను మభ్యపెట్టి మచ్చిక చేసుకొనేందుకు రూ.1500 నుంచి రూ.4వేల వరకు పంపిణీ చేసేందుకు నగదును సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు ఆర్మూర్లో గుసగుసలు వినబడుతున్నాయి.

Next Story