ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం : జిల్లా ఇంటర్ విద్య అధికారి టి . రవికుమార్

by Disha Web Desk 11 |
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం : జిల్లా ఇంటర్ విద్య అధికారి టి . రవికుమార్
X

దిశ, నిజామాబాద్ సిటీ : తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైందని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి శ్రీ టి.రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈనెల 9వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయిందని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ల ప్రిన్సిపాల్ లు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో విద్యార్థులు పదో తరగతి పాసైన ఇంటర్నెట్ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా అడ్మిషన్ చేసుకోబడుతుందని తెలియజేశారు.

పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వడంతో పాటు ప్రతి విద్యార్థిని, విద్యార్థికి ఉపకార వేతనము( స్కాలర్షిప్) తో పాటు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబడుతుందని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్ లు, లైబ్రరీలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఎక్విప్మెంట్ తో ప్రభుత్వం పూర్తిగా ఉచిత విద్య అందిస్తుందని తెలియజేశారు.

అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం తో పాటు కొన్ని కళాశాలలో ఉర్దూ మీడియం, ఒకేషనల్ వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల లో మంచినీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని, ప్రత్యేకంగా బాలికల కళాశాలలో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలియజేశారు. మొదటి విడత అడ్మిషన్లను మే 31వ తేదీ వరకు పొందవచ్చని , అడ్మిషన్లు పొందిన విద్యార్థులందరికీ వెంటనే తరగతులు ప్రారంభమవుతాయని జిల్లా ఇంటర్ విద్య అధికారి తెలియజేశారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed