- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాచర్లలో నర్సరీలు ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
ఆలూర్ మండల కేంద్రంలోని మాచర్ల గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్, మాచర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య నర్సరీలను పరిశీలించారు.

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల కేంద్రంలోని మాచర్ల గ్రామంలో ఎంపీడీఓ గంగాధర్, మాచర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో మొక్కల పెంపకం, సంరక్షణ, నీటి సౌకర్యాలు, నిర్వహణ విధానాలను ఆయన పరిశీలించి, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిచి పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని లబ్ధిదారులు, అధికారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. నిర్మాణాలు చేపట్టి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామానికి సంబంధించిన వివిధ రికార్డులను తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, అభివృద్ధి పనులను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శు నసీర్, మాచర్ల సర్పంచ్ కట్ట నర్సయ్య పాల్గొన్నారు.






