కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించాలి : డీసీఓ రామ్మోహ‌న్

by Ratna Kumari |

దిశ, గాంధారి : వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కామారెడ్డి జిల్లా సహకార అధికారి రాంమోహన్ అన్నారు..మంగళవారం వ్యవసాయ

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించాలి : డీసీఓ రామ్మోహ‌న్
X

దిశ, గాంధారి : వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించాలని కామారెడ్డి జిల్లా సహకార అధికారి రాంమోహన్ అన్నారు..మంగళవారం వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండలంలోని గుర్జాల్, పేట్ సంగెం, మాతు సంగెం, గాంధారి -1, గాంధారి -2 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని, అందులో తేమ శాతాన్ని ఆయన పరిశీలించారు. తేమ శాతం 17% వచ్చిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మౌలిక వసతుల గురించి స్థానిక రైతులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులకు టార్పాలిన్ కవర్ లు అందుబాటులో ఉంచాలని పాక్స్ సిబ్బంది కి సూచించారు. ఈ కార్యక్రమంలో పాక్స్ కార్యదర్శి గాండ్ల సాయిలు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు..

Next Story