- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండేళ్లలో 9 శాతమే ఇందిరమ్మ ఇళ్లు
జుక్కల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 3000 మంజూరు కాగా రెండేళ్లలో కేవలం 9 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగతా 90% ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హౌజింగ్ అధికారులపై ఫైర్ అయ్యారు.

దిశ, కామారెడ్డి : జుక్కల్ నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇండ్లు 3000 మంజూరు కాగా రెండేళ్లలో కేవలం 9 శాతం మాత్రమే పూర్తయ్యాయని, మిగతా 90% ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని ఏళ్లు పడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు హౌజింగ్ అధికారులపై ఫైర్ అయ్యారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లకు కావాల్సిన ఇసుక, మొరం తెచ్చుకుంటున్న లబ్ధిదారులపై కేసులు పెడుతూ దొంగలను మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను మానవతా దృక్పథంతో చూడాలని, వారికి కావాల్సిన, ఇసుక, మొరం తెచ్చుకునేందుకు అధికారులు సహకరించాలని సూచించారు. ఇసుక, మొరం తీసుకు వెళుతున్న లబ్ధిదారులను మానవతా దృక్పథంతో వదిలేయాలని పోలీసులను కోరినప్పటికీ వారి పైన కేసులు పెట్టడం శోచనీయమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల యాప్ లో లబ్దిదారుల్లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి అవసరమైన సలహాలు, సూచనలు ఉన్నప్పటికీ ఈ విషయం అధికారులకు కూడా తెలియకపోవడం విడ్డూరమన్నారు. అధికారులు తమ విధులను ఐదు గంటల వరకు పని చేయాల్సి ఉన్నప్పటికీ, వాళ్లు ఒక్క నిమిషం కూడా ఎక్కువ పని చేయకున్నప్పటికీ పని చేసిన సమయంలో ప్రజలు సంతృప్తి చెందేలా సమన్వయంతో పని చేయాలని సూచించారు. గరీబోళ్లు, ప్రజల సమస్యలపై మాట్లాడితే కాంట్రవర్సీ అనుకుంటే తాను ప్రతిరోజు కాంట్రవర్సీనే మాట్లాడతానన్నారు.
లాభసాటి పంటలపై దృష్టి సారించాలి : వ్యవసాయ శాఖ, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలు సాంప్రదాయ పంటలు కాకుండా లాభసాటి పంటలపై దృష్టి సారించేలా అధికారులు కృషి చేయాలని వ్యవసాయ శాఖ, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. సంవత్సరానికి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం తినడానికి అవసరం కాగా అంతకంటే ఎక్కువగానే పండిస్తున్నారన్నారు. దీంతో ఆ ధాన్యాన్ని నిల్వ చేయడానికి గోదాములు కూడా సరిపోవడం లేదన్నారు. అందుకే అధికారులు పంట మార్పిడి కోసం రైతులను ప్రోత్సహించాలని, రైతు వేదికలలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఇందిరమ్మ ఇళ్లు అనర్హులకు కూడా వస్తున్నాయనే ఫిర్యాదులు వస్తున్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హులకే వచ్చేలా పరిశీలించాలని సూచించారు.






